పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెన వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. తణుకుకు చెందిన నంబూరు శ్రీనివాస్, పద్మిని దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నదిలోకి దూకారు.
వీరికి 16 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వీరు గత 20 ఏళ్లుగా తణుకులో నివసిస్తూ కిరాణా, పాల వ్యాపారం చేస్తున్నారు.
వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో అప్పుల బాధ పెరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం.
నదిలోకి దూకిన వారిలో పద్మినిని స్థానిక మత్స్యకారులు గమనించి రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీనివాస్‌తో పాటు వారి ఇద్దరు పిల్లలు నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.







