ఆంధ్ర‌ప్ర‌భ : మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు అనంతరం ఉదయ్‌కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం.

గత రెండు రోజులుగా ఆయనకు నోటీసులు అందజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో ఆయన పేర్కొన్న రెండు చిరునామాల్లోనూ ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఉదయ్‌కృష్ణారెడ్డి ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.