కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం 2026 జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల నుంచి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారతదేశంలో రూ. 6.67 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 8.16 కోట్ల వసూళ్లతో ఆశించిన స్థాయిలో ఆడలేదు.
అయితే, ఆగస్టు 14న జీ5 ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన తర్వాత ఈ సినిమా పరిస్థితి పూర్తిగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు డిజిటల్ వేదికపైకి వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్‌కు చేరుకుంది.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, పిల్లలతో సహా రోగులను ఎలా కాపాడారనే అంశాన్ని ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఈ సినిమా తర్వాత కంగనా రనౌత్ తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది. ఆమె ‘సర్కిల్’ అనే చిత్రంతో పాటు, 2014లో వచ్చిన ‘క్వీన్’ సినిమాకు కొనసాగింపుగా ‘క్వీన్ 2’లో నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే వీటిపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.








