ప్రెజెంటేషన్ల తయారీలో ప్రత్యేకత కలిగిన NextSlide స్టార్టప్‌ను OpenAI కొనుగోలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ డీల్ పూర్తయినప్పటికీ, ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం OpenAI బయటపెట్టలేదు.

NextSlide టెక్నాలజీ ప్రాంప్ట్‌లు, నోట్స్, డాక్యుమెంట్లు లేదా పరిశోధనా పత్రాలను సులభంగా ఎడిట్ చేయగల ప్రెజెంటేషన్లుగా మారుస్తుంది. విజువల్ కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ స్టార్టప్ పనిచేసింది. ఇప్పుడు ఈ బృందం OpenAIలో చేరి, అదే లక్ష్యంతో ChatGPT కోసం పనిచేస్తున్నారు.

ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు Ahmed Beshry గతంలో Caper AI సహ వ్యవస్థాపకుడిగా పనిచేశారు. 2021లో Caper AI సంస్థను Instacart కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు NextSlide బృందం OpenAIలో చేరడంతో, వారి నైపుణ్యాలను ChatGPT మెరుగుపరచడానికి ఉపయోగించనున్నారు.