నిజామాబాద్‌ నగరంలోని అమ్మ వెంచర్‌లో సిరివెన్నెల గ్రీన్ సొసైటీ సభ్యులు 120 మొక్కలను నాటారు. పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సొసైటీ వ్యవస్థాపకులు రావుట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో చేపట్టారు.

కాలుష్యం వల్ల ఇప్పటికే అనేక జీవజాతులు కనుమరుగయ్యాయని రావుట్ల జనార్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రమోద్, జయ లక్ష్మణ్, పంచారెడ్డి రాము, అరుగుల సత్యం, అల్గోటు రవీందర్ మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.