ఖమ్మంలోని సంజీవ రెడ్డి భవన్ నుంచి జెడ్‌పి సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండటంపై ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిరసనలు కేవలం ఖమ్మంకే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.








