గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 సార్లు పేపర్ లీక్ అయ్యాయని, దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా, ఇప్పటివరకు ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని రాహుల్ విమర్శించారు. ఈ వ్యవస్థ వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మూడు ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పరీక్షలో జరిగిన లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, ఈ ఘటనలపై ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.