ముంబయి విమానాశ్రయంలో గోవిందా, నటి కోమల్ రాణి స్వర్ణకర్ జంటగా కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలవ్వడంతో, నెటిజన్లు గోవిందా భార్య సునీత అహుజాను ఈ విషయంపై ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన సునీత, గోవిందా తీరును తప్పుబట్టారు. తన కూతురి వయసున్న అమ్మాయితో తిరుగుతున్న గోవిందాకు కనీసం సిగ్గుండాలని ఆమె ఘాటుగా విమర్శించారు. అసలు సినిమా షూటింగ్ పూర్తి చేయకుండానే వీరిద్దరూ ప్రమోషన్లు చేసుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు.

కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్‌లో నటిగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు. గోవిందా నిర్మిస్తున్న 'రూపా', 'దునియాదారి' అనే రెండు కొత్త సినిమాల్లో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్‌ను కథానాయికగా ఎంపిక చేశారు.

గోవిందా నిర్మిస్తున్న ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ రాణి స్వర్ణకర్ నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాల ప్రమోషన్ల కోసమే వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.