కుంభ మేళాకు సంబంధించిన పనుల కోసం కాంట్రాక్టులు ఇప్పిస్తామని నమ్మించి, బాధితుల నుంచి రూ. 3.05 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఆరుగురిని నాశిక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఒప్పందాల కోసం అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అరెస్టు అయిన వారిలో తనయ్ అనంత్ మహజాన్, నరేంద్ర తోటారాం మహజాన్, షోయిబ్ అహ్మద్ అబ్దుల్ సత్తార్ షేక్, అబ్దుల్ రాయిస్ అబ్దుల్ మునాఫ్ షేక్, షకీల్ అహ్మద్ సలీముద్దీన్ షేక్, మహోమద్ వాసీం అబ్దుల్ గఫార్ ఉన్నారు.
ఈ ఘటనపై నాశిక్ రోడ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







