కథలాపూర్‌, జూలై 26 : జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండకు చెందిన రైతు దొప్పల జలంధర్‌ ‘మేడిగడ్డ బ్యారేజీ రిపేర్‌ చేయాలి’ అని తెలుగు అక్షరాల రూపంలో వరి నారు పోసి, ఎదిగిన నారును చూపిస్తూ ఆదివారం నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కెనాల్‌, వరదకాలువ ద్వారా నీరందితేనే పంటలు పండుతాయని తెలిపాడు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వరదకాలువకు నీటి విడుదల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించాడు. వరదకాలువ ద్వారా నీరు విడుదల చేయకపోతే వరి, మక్కజొన్న పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తంచేశాడు.