ఢిల్లీలో జెన్ జెడ్ (Gen-Z) యువత చేస్తున్న నిరసనల నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సూచనలు చేశారు. యువత ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్‌లోనే గడుపుతున్నారని, వారితో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి మంత్రులు కూడా ఆ వేదికపై యాక్టివ్‌గా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ప్రతి మంత్రి ఇంటరాక్టివ్ కంటెంట్‌తో కూడిన రీల్స్‌ను రూపొందించి పోస్ట్ చేయాలని ప్రధాని ఆదేశించారు. ఎంతమంది మంత్రులు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారనే అంశంపై కూడా ఆయన ఆరా తీశారు. ఈ సూచనలు చేసిన కొన్ని గంటల ముందే, ప్రధాని మోదీ స్వయంగా ఒక రీల్ ఫార్మాట్ వీడియోను తన అధికారిక ఎక్స్ (X) ఖాతాతో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలకు సంబంధించి లక్షలాది వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రభుత్వంపై యువత ఉద్యమించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఒక వేదికగా నిలిచిందని గుర్తించిన ప్రధాని, యువతకు వారి మార్గంలోనే దగ్గరవ్వాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.








