న్యూఢిల్లీ : మానవుల గరిష్ఠ ఆయుష్షు 156 సంవత్సరాలుగా నిర్ణయించిన ఎన్‌పీజే ఏజింగ్ అధ్యయనం ప్రధానంగా హృదయం, మెదడు కణాలలో సంభవించే సోమాటిక్ మ్యుటేషన్లపై దృష్టి పెట్టింది. ఈ మ్యుటేషన్లు తిరిగి సరిచేయలేని కణాల పేరుకుపోవడం వల్ల వృద్ధాప్య మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుత యాంటీ ఏజింగ్ చికిత్సలు ఈ పరిమితిని దాటలేవని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. కాలేయం వంటి అవయవాలు కొత్త కణాలను ఉత్పత్తి చేసుకోగలిగినా, హృదయం మరియు మెదడు కణాల్లోని మ్యుటేషన్లు దీర్ఘాయువును తగ్గిస్తున్నాయని వివరించారు. ఈ పరిమితిని తొలగించడానికి అవసరమైన శస్త్రచికిత్సలు ప్రస్తుతం అందుబాటులో లేవని కూడా తెలిపారు.
ఈ పరిశోధనలో సహ-రచయిత ఎవ్గెనీ ఎఫిమోపోవ్ ప్రకారం, సోమాటిక్ మ్యుటేషన్లను పూర్తిగా తొలగించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదు. భవిష్యత్తులో మరిన్ని వృద్ధాప్య కారణాలను ఈ అధ్యయనంలో చేర్చినట్లయితే, గరిష్ఠ ఆయుష్షు మరింత తగ్గే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.






