వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో నిధి అగర్వాల్‌తో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.

గతంలో ‘తంత్ర’ చిత్రంతో గుర్తింపు పొందిన శ్రీనివాస్ గోపిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ ప్రధానంగా సాగే ఈ కథ కోసం ఆయన ఒక శక్తివంతమైన స్క్రిప్టును సిద్ధం చేశారు. పురాణాల నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నిధి అగర్వాల్ కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. సినిమా టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.