సాధారణంగా ద్రవ పదార్థాలను లీటర్లు లేదా మిల్లీలీటర్లలో కొలుస్తారు. అయితే మద్యం విషయంలో మాత్రం ఈ లెక్కలు భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో మద్యం విక్రయాలు, తాగే అలవాట్లపై బ్రిటిష్ వారి ప్రభావం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
అంతర్జాతీయంగా ఆల్కహాల్‌ను ఔన్సులలో కొలుస్తారు. ఒక ఔన్సు అంటే సుమారుగా 29.5 మిల్లీలీటర్లు ఉంటుంది. దీనిని లెక్కల సౌలభ్యం కోసం 30 మిల్లీలీటర్లుగా పరిగణిస్తారు. మద్యం సీసాలను తయారు చేసేటప్పుడు, అందులోని ద్రవం పెగ్గుల సంఖ్యకు సరిగ్గా సరిపోయేలా కొలతలను రూపొందించారు.
క్వార్టర్ సీసాలో 180 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. ఇందులో 30 మిల్లీలీటర్ల చొప్పున 6 చిన్న పెగ్గులు లేదా 60 మిల్లీలీటర్ల చొప్పున 3 పెద్ద పెగ్గులు వస్తాయి. అలాగే 375 మిల్లీలీటర్ల హాఫ్ సీసాలో దాదాపు 12 చిన్న పెగ్గులు లేదా 6 పెద్ద పెగ్గులు పడతాయి.
ఫుల్ సీసాలో 750 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. ఇందులో 30 మిల్లీలీటర్ల చొప్పున సరిగ్గా 25 చిన్న పెగ్గులు వస్తాయి. ఒకవేళ సీసా 1000 మిల్లీలీటర్లు అంటే ఒక లీటరు ఉంటే, పెగ్గుల లెక్కలు పాయింట్లలోకి మారి గందరగోళంగా మారుతాయి.
పెగ్గుల లెక్కలను సులభంగా ఉంచడానికే 750 మిల్లీలీటర్లను ఫుల్ బాటిల్‌గా నిర్ణయించారు. హిందీ, ఇతర స్థానిక భాషల్లో వీటిని ఖంభా అంటే ఫుల్ అని, అధా అంటే హాఫ్ అని, పౌవా అంటే క్వార్టర్ అని పిలుస్తుంటారు.








