మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేట బాలుర మైనారిటీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిపై అదే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
బాధిత బాలుడు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించడంతో, వారు వెంటనే స్పందించి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అయితే, ఈ ఘటన జరిగిన విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల వార్డెన్ల బాధ్యతారాహిత్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని నిలదీస్తున్నారు.








