హాలీవుడ్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ తదుపరి జేమ్స్ బాండ్ (గూఢచారి పాత్ర) పాత్రకు అధికారికంగా ఎంపికయ్యారు. నవంబర్ 16న ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఆయన బ్లాక్ టూకెడో, వైట్ షర్ట్, బ్లాక్ బో టై ధరించి చేతిలో పిస్టల్ పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. బాండ్ 007 క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశారు.
అధికారిక ఫిల్మ్ సిరీస్‌లో ఏడో జేమ్స్ బాండ్ నటుడిగా 40 ఏళ్ల ప్యాటిన్సన్ ఈ పాత్రను పోషిస్తున్నారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీకి వస్తున్న 26వ చిత్రం ఇది. ఈ సినిమాకు డెనిస్ విల్లెనూవ్ దర్శకత్వం వహిస్తుండగా, స్టీవెన్ నైట్ స్క్రిప్ట్ అందిస్తున్నారు.
ఈ సినిమా ప్రకటనపై ఫ్రాంచైజీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ స్పందించింది. రాబర్ట్ ప్యాటిన్సన్ జేమ్స్ బాండ్ అంటూ ఆ హ్యాండిల్ ద్వారా కూడా ప్రకటన వెలువడింది.








