భారతదేశంలో కోల్ బీడ్ మెతన్ (CBM) వనరుల అన్వేషణ మరియు పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో సుమారు 92 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల మేర ఈ మెతన్ వనరులు ఉన్నట్లు అంచనా. వీటిని వెలికితీసేందుకు వీలుగా ప్రభుత్వం పరిశోధనలకు అనుమతులు మంజూరు చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 కోల్ బీడ్ మెతన్ బ్లాకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా రోజుకు 2.28 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

కోల్ బీడ్ మెతన్ రంగంలో పెట్టుబడులను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు 1997లోనే ప్రభుత్వం కీలక పాలసీ మార్పులను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, తాజా పరిశోధనలకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఇంధన వనరుల లభ్యతను పెంచే ప్రయత్నం చేస్తోంది.