భువనగిరి : పట్టణంలోని రైతు బజార్‌ చౌరస్తా వద్ద ఆదివారం బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుమారస్వామి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్‌ గుప్తా, పట్టణ కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు డీఎల్‌ఎన్‌గౌడ్‌ పట్నం కపిల్‌, కృష్ణాచారి, గణేష్‌, సాయి, పరమేష్‌, వెంకట్‌రెడ్డి, మహేష్‌, సిద్దుగౌడ్‌ ఉన్నారు.