డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో రాజధాని కిన్‌షాషాలో ఒక భవనంలో జరుగుతున్న వివాహ వేడుకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారని లింగ్వాలా మేయర్ నార్బర్ట్ ముషింగ ధృవీకరించారు.
వివాహ వేడుక జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మేయర్ నార్బర్ట్ ముషింగ తెలిపారు.
ప్రస్తుతానికి ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.








