కాలిఫోర్నియాలో ప్రవేశపెట్టనున్న 'Prop 40' పన్ను ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భారీగా నిధులు వెచ్చించారు. ఇందులో భాగంగా ఆయన 'బిల్డ్ ఏ బెటర్ కాలిఫోర్నియా' అనే సంస్థకు 20 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం మీద ఈ పన్నును అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన 100 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.
ఈ 'Prop 40' పన్ను నిబంధన ప్రకారం, రాష్ట్రంలో నివసిస్తున్న సుమారు 200 మంది బిలియనీర్ల నికర ఆస్తులపై ఒకేసారి 5 శాతం పన్ను విధించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వం సుమారు 13.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ నిధులను కాలిఫోర్నియా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల కోసం వినియోగించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ పన్నును తప్పించుకునేందుకు టెక్ రంగంలోని ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. సెర్గీ బ్రిన్ తరహాలోనే మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, ఉబెర్ మాజీ సీఈఓ ట్రావిస్ కలానిక్ వంటి బిలియనీర్లు ఇప్పటికే కాలిఫోర్నియా నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.







