మన తెలంగాణ/హైదరాబాద్: జర్నలిస్టుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశం డి మాండ్ చేసింది. బెంగళూరులో రెండు రోజులపాటు జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ సమావేశానికి ఐ.జే.యు. జాతీయ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జ మ్మూ అధ్యక్షత వహించారు. ఇటీవల జర్నలిస్టులపై భౌతిక దాడులు, బెదిరింపులు, చ ట్టపరమైన దాడులు, హింస పెరిగిపోవడం, వార్తావనరుల గోప్యతకు అవసరమైన చట్టా లు లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యం లో భారతదేశంలో జర్నలిస్టుల, మీడియా సంస్థల భద్రతకు ఒక ప్రత్యేక బలమైన చట్టం చేయాల్సిన అవసరం ఉందని కార్యవర్గ సమావేశం ఆమోదించిన ఒక తీర్మానంలో డిమాండ్ చేసింది. ఐ.జే.యు పూర్వాధ్యక్షుడు, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో పత్రికా స్వేచ్ఛ నానాటికి దిగజారి పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛకు గట్టి హామీ ఇచ్చినప్పటికీ వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ కల్పించే సమగ్ర చట్టం లేకపోవడం వల్లనే బెదిరింపులు, దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమాచార పౌరసంబంధాల బడ్జెట్‌ను, వివిధ శాఖలు జారీచేసే ప్రకటనలను అనుకూల ప్రచారం కోసం ఆయుధాలుగా వినియోగించడాన్ని ఆ తీర్మానంలో ఖండించారు. 1955, 1958 సంవత్సరాల నాటి రెండు వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు వృత్తి భద్రత, వేతనభద్రత, మెరుగైన పని పరిస్థితులు కల్పించేందుకు వీలుగా ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ఐజేయు మరో తీర్మానంలో డిమాండ్ చేసింది.

వివిధ మీడియా సంస్థలలో కొనసాగుతున్న ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 58 నుండి 60 సంవత్సరాలకు పెంచాలని సమావేశం ఆమోదించిన మరో తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో మీడియా స్థితిగతులపై, గత నాలుగు నెలల్లో యూనియన్ నిర్వహించిన కార్యకలాపాలపై నివేదికను ఐ.జే.యు సెక్రెటరీ జనరల్ డి.సోమసుందర్ ప్రవేశపెట్టారు. ఐ.జే.యు. స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్, ఎం.ఎ. మాజిద్, జాతీయ ఉ పాధ్యక్షులు అమర్ మోహన్ ప్రసాద్, వై.న రేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శులు డి.ఎస్. ఆర్. సుభాష్, పి.భాస్కర్ రెడ్డి, నరేంద్ర భరద్వాజ్, కర్ణాటక స్టేట్ జర్నలిస్ట్స్ యూనియ న్ అధ్యక్షురాలు ఎం.జానకీ మోహన్, ప్రధా న కార్యదర్శి అంజన్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరు తూ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ‘జర్నలిస్ట్ డి మాండ్స్ డే’ ను దేశవ్యాప్తంగా పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపునిచ్చింది. నవంబర్ 16న జాతీయ ప త్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వీర్యమైపోయిన ప్రస్తుత పరిస్థితులపై దేశవ్యాప్త చర్చను లేవనెత్తాలని, సమస్యపై అవగాహన పెంచేందుకు, పటిష్టమైన మీడియా కౌన్సిల్ అవసరాన్ని వివరిస్తూ ప్రచార ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టాల ని పిలుపునిచ్చింది. అక్టోబర్ చివరిలో మహి ళా జర్నలిస్టుల జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.