మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ మొదలైంది. పార్టీ నాయకత్వ బాధ్యతల కోసం రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించారు.
దరఖాస్తుదారుల నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల వారికున్న అంకితభావం, క్షేత్రస్థాయిలో వారు చేస్తున్న పనితీరును పరిగణనలోకి తీసుకుని కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కమిటీల నియామక ప్రక్రియను చేపట్టినట్లు జనసేన పేర్కొంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.








