ఈ ఆగస్టు నెలలో వరుస చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. గత వారం విడుదలైన సినిమాలు ప్రేక్షకులను అలరించగా, ఈ వారం మరియు వచ్చే వారం మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిజానికి ఆగస్టు 20న దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐమ్ గేమ్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల కావాల్సి ఉంది. అదే సమయంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన ‘ఖలీఫా’ చిత్రం కూడా పోటీలో ఉంది. అయితే, ఈ పోటీ నేపథ్యంలో దుల్కర్ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. సినిమా నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం ఒకటైతే, ఆ చిత్రంపై ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడం మరో కారణమని సమాచారం.