సూర్య, జ్యోతికది హిట్‌ జోడీ. పెళ్లికి ముందు పలు సినిమాల్లో కలిసి నటించిన వీళ్లు.. తర్వాత ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. సూర్య తమిళ చిత్రాలతో బిజీగా ఉంటే, జ్యోతిక హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే మళ్లీ కలిసి నటించబోతున్నట్లు టాక్ నడుస్తుండగా దీనిపై జ్యోతిక స్పందించింది.

మేం మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు, కథలు కూడా వింటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేవీ జరగలేదు. మంచి కథ సెట్ అయితే కలిసి నటించడానికి సిద్దమే. తమకు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మంచి ప్రేమ లభిస్తోంది. ఆన్‌ స్క్రీన్‌లో తమని చూడాలని ఎవరూ కోరుకోవడం లేదు అనుకుంటా అని జ్యోతిక చెప్పుకొచ్చింది.

సూర్య నటించిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్‌ పూర్తి అయ్యింది. 'రోలెక్స్'‌ గురించి మాట్లాడుతూ లోకేశ్‌ కనకరాజ్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా చిత్రం చేసే పనిలో ఉన్నారని, తర్వాత 'విక్రమ్‌ 2' ఉందని.. అయినా రోలెక్స్‌ మూవీ ఉంటుందనీ, కథను రెడీ చేస్తున్నట్లు లోకేశ్‌ కనక రాజ్‌ చెబుతున్నాడని, అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది కాలమే చెప్పాలని సూర్య అన్నాడు.