తమ దేశ చట్టాలు, సామాజిక విలువలతో విభేదించే వ్యక్తులు దేశంలోకి ప్రవేశించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. తాను ముస్లిం వ్యతిరేకిని కాదని, కేవలం దేశ విలువలకే ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ది ఎకనామిస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన వ్యాఖ్యల్లోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో సాంప్రదాయ మీడియా విఫలమైందని మస్క్ విమర్శించారు. తనపై వస్తున్న జాతి వివక్ష ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన భాగస్వామి భారతీయ మూలాలు ఉన్నవారని, తన కంపెనీలో వివిధ వర్గాలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
తాను మితవాద తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నాననే వాదనలను మస్క్ కొట్టిపారేశారు. తన అభిప్రాయాలు సాధారణ ప్రజల ఆందోళనలకు అద్దం పడతాయని ఆయన తెలిపారు. ఈ అంశాలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ, మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు.








