మానవాళికి మేలు చేసేలా సూపర్ ఇంటెలిజెంట్ AIని అభివృద్ధి చేయాలని Meta సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన తాజా వ్యాసంలో పేర్కొన్నారు. AI డేటా సెంటర్ల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు కంపెనీ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డేటా సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి మౌలిక సదుపాయాలను Meta నిర్మించనుంది.
పర్యావరణ బాధ్యతలో భాగంగా 2030 నాటికి తాము వినియోగించే నీటి కంటే ఎక్కువ మొత్తాన్ని వాటర్‌షెడ్లలో తిరిగి పునరుద్ధరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, డేటా సెంటర్ల నిర్మాణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు, వారికి అధిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు జుకర్‌బర్గ్ వెల్లడించారు.








