నిందితులు 2024లో రూ. 10 లక్షలకు ఒక నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వరిస్తుందని, దీనికి ప్రత్యేక దివ్యశక్తులు ఉన్నాయని ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించేవారు. ఈ విగ్రహాన్ని భారీ ధరకు విక్రయించి లాభాలు పొందాలని వారు ప్లాన్ చేశారు.

ఈ మోసపూరిత పథకంలో ఒక జ్యోతిష్యుడు ప్రధాన పాత్ర పోషించగా, మిగిలిన నిందితులు కార్ డ్రైవర్లు మరియు ఒక కార్మికుడు. విగ్రహంతో పాటు అరుదైన గులాబీ రంగు రాయి పేరుతో మరొక మోసానికి కూడా వారు సిద్ధమయ్యారు. జ్యోతిష్యుడి సలహాలతో కొనుగోలుదారులను బురిడీ కొట్టించేందుకు ఈ ముఠా ప్రయత్నించింది.

పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న నకిలీ విగ్రహం, పింక్ కలర్ రాయి, మూడు రసాయన ద్రావణాల బాటిళ్లు, ఒక ఎర్టిగా కారు మరియు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి నకిలీ విగ్రహాల పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.