నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహాన్ని ఆగస్టు 16న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుక కోసం పెళ్లి మండపాన్ని ఒక ఆలయంలా కనిపించేలా భారీ సెట్స్‌తో తీర్చిదిద్దారు.

ప్రధాన వివాహ వేదిక పక్కనే అతిథులు కూర్చోవడానికి ప్రత్యేకంగా మరికొన్ని మండపాలను సిద్ధం చేశారు. ఈ సెట్స్‌లో భారీ వేంకటేశ్వరస్వామి, అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు, మండపం మొత్తం పూలతో అలంకరించారు.

సినిమాల్లోని సెట్స్‌ను తలపించేలా, బాహుబలి సినిమా తరహాలో భారీ స్థాయిలో ఈ వివాహ వేదికను రూపొందించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.