హైదరాబాద్ కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ పట్టపు సతీశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 10టీవీ గ్లోబల్ ఫుట్‌ప్రింట్స్ అనే కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎగుమతులు అంటే కేవలం వస్తువుల రవాణా మాత్రమే కాదని, అవి దేశ పారిశ్రామిక సత్తాను ప్రపంచానికి చాటుతాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలు చూపిస్తున్న చొరవ, ఉత్సాహం అభందనీయమని ఆయన తెలిపారు.

ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు కస్టమ్స్, వాణిజ్య విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు మీడియా సంస్థలు ముందుకు రావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ నుంచి ఎగుమతులు మరింత పెరగాలని, తద్వారా ప్రపంచ మార్కెట్లలో భారత ఉత్పత్తులకు మంచి గుర్తింపు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రంగంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు.