హోర్ముజ్ జలసంధిలో నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడటంతో పాటు, తమ దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఇరాన్, ఒమన్ ప్రకటించాయి. నౌకలు ఏ మార్గంలో వెళ్లాలో తెలిపే ఒక ప్రత్యేక 'షిప్పింగ్ మ్యాప్'ను ఇరు దేశాలు సిద్ధం చేశాయి.
అయితే, ఈ జలసంధిని సాధారణ రాకపోకలకు పూర్తిగా తెరవాలంటే అమెరికా కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా వైఖరిపైనే ఈ మార్గం పూర్తిస్థాయి వినియోగం ఆధారపడి ఉంది.
ప్రస్తుతానికి ఈ ఒప్పందం ప్రాథమిక దశలోనే ఉంది. సాంకేతిక అంశాలపై చర్చలు జరగాల్సి ఉండగా, దీనికి సంబంధించి ఉమ్మడి ప్రకటన రావాల్సి ఉంది. నౌకల నుంచి ప్రయాణ రుసుములు వసూలు చేస్తారా లేదా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయనే విషయాలపై ఇరాన్ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.








