హానర్ సంస్థ కొత్తగా Honor 600 Elite 5G స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఈ ఫోన్లో 8,100mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 45W హానర్ సూపర్ ఛార్జ్ సపోర్ట్తో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ఆరు సంవత్సరాల పాటు నాణ్యమైన పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఫోన్ 6.87 అంగుళాల టీఎప్టీ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 1592 x 720 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గరిష్ఠంగా 1,020 నిట్స్ HBM బ్రైట్నెస్ను ఇది సపోర్ట్ చేస్తుంది. HBM అంటే డిస్ప్లే అత్యంత ప్రకాశవంతంగా కనిపించేలా చేసే హై బ్రైట్నెస్ మోడ్.
ఫోన్ పనితీరు కోసం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్ను వాడారు. ఇందులో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. అదనంగా 16GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ద్వారా మొత్తం ర్యామ్ను 24GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్OS 10.0 సాఫ్ట్వేర్పై పనిచేస్తుంది.
కెమెరా విభాగంలో 108MP మెయిన్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. ఏఐ (AI) ఆధారిత ఫీచర్లతో పాటు ఫొటోల నుంచి వీడియోలను రికార్డు చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది.
ఈ ఫోన్కు IP68, IP69, IP69K రేటింగ్స్ లభించాయి. అంటే నీరు, ధూళి నుంచి ఫోన్కు రక్షణ ఉంటుంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు, 5జీ, బ్లూటూత్ 5.1, USB-C మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం హానర్ అధికారిక వెబ్సైట్లో డిజర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్, మెటెయర్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కనిపిస్తోంది. అయితే, దీని ధరను లేదా ఇతర మార్కెట్లలో లభ్యతను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.








