LAVA సంస్థ బడ్జెట్ ధరలో కొత్తగా BLAZE N4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ద్వారా కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను మరింత విస్తరించాలని చూస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, కెమెరా ఫీచర్లను ఈ ఫోన్‌లో హైలైట్స్‌గా పేర్కొంది.
ఈ ఫోన్ 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో (స్క్రీన్ సెకనుకు 120 సార్లు అప్‌డేట్ అయ్యే వేగం) పనిచేస్తుంది. అలాగే, నీటి చినుకులు, దుమ్ము నుంచి రక్షణ ఇచ్చే IP64 రేటింగ్‌ను కూడా ఈ ఫోన్ పొందింది.
పనితీరు విషయానికి వస్తే, ఇందులో ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్ (ఫోన్ మెదడు వంటి ప్రాసెసర్) ఉంది. మల్టీటాస్కింగ్ కోసం ఇందులో వర్చువల్ ర్యామ్ సదుపాయం ఉంది. 6GB LPDDR4x ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో, మైక్రో SD కార్డు ద్వారా మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా పరంగా చూస్తే, వెనుక భాగంలో 50MP AI ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. ఇది 2k వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరాను అమర్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
ఈ ఫోన్ 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్ బరువు 207 గ్రాములు. ఇది మిడ్‌నైట్ బ్లూ, లేత లావెండర్, సిల్వర్ గ్రేడియంట్ రంగులలో లభిస్తుంది.
6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ. 13,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమెజాన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి వస్తుంది.








