యూజీన్‌‌ (అమెరికా): వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ అండర్‌‌–20 చాంపియన్‌‌షిప్స్‌‌లో భారత యువ అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల హైజంప్‌‌లో బసంత్‌‌ కుమార్‌‌ మెఘ్వాల్‌‌ చారిత్రక సిల్వర్​ సాధించగా.. లాంగ్‌‌జంప్‌‌లో షానవాజ్‌‌ ఖాన్‌‌ కాంస్యం గెలిచాడు. దీంతో టోర్నీలో భారత్‌‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది.

రాజస్థాన్‌‌లోని అనూప్‌‌గఢ్‌‌కు చెందిన 19 ఏళ్ల మెఘ్వాల్‌‌.. హైజంప్‌‌లో 2.21 మీటర్లు క్లియర్‌‌ చేసి, వరల్డ్‌‌ అండర్‌‌–20 చాంపియన్‌‌షిప్స్‌‌ హైజంప్‌‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు మెన్స్​ లాంగ్‌‌జంప్‌‌లో 18 ఏళ్ల షానవాజ్‌‌ ఖాన్‌‌ 7.84 మీటర్లతో కాంస్యం సాధించాడు.

ఇటలీకి చెందిన డానియెలె ఇంజోలి 7.97 మీటర్లతో గోల్డ్‌‌, ఆస్ట్రేలియా అథ్లెట్‌‌ మేసన్‌‌ మెక్‌‌గ్రోడర్‌‌ 7.96 మీటర్లతో సిల్వర్‌‌ నెగ్గారు. భారత అథ్లెట్‌‌ జితిన్‌‌ అర్జునన్‌‌ 7.59 మీటర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.