మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కిశోర్ కుమార్ రెడ్డి, బాలలపై లైంగిక నేరాల చట్టం (POCSO) కేసులో అరెస్టయ్యాడు. ప్రస్తుతం ఇతడు చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
మంగళవారం వైద్య పరీక్షల కోసం హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరెడ్డి, కానిస్టేబుల్ రాహుల్ అతడిని ఎర్రగడ్డలోని మానసిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. పోలీసుల పర్యవేక్షణలో (ఎసార్ట్) ఉన్న నిందితుడు, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాక బాత్‌రూమ్‌కు వెళ్తానని చెప్పాడు.
అయితే, బాత్‌రూమ్‌లోకి వెళ్లిన కిశోర్ కుమార్ రెడ్డి అక్కడి వెంటిలేటర్ ద్వారా బయటకు దూకి పరారయ్యాడు. పోలీసు సిబ్బంది వెంటనే గాలింపు చేపట్టినప్పటికీ, అతడి ఆచూకీ లభించలేదు.
ఈ ఘటనపై ఎసార్ట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.








