ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు పట్టణ స్థానిక సంస్థల్లోని 12 పోలింగ్ బూత్‌లలో నేడు రీ-పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
అయితే, కడప జిల్లా పులివెందులలోని జెండామాన్ వీధిలో ఉన్న గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి భిన్నంగా ఉంది. నిర్ణీత సమయం దాటినా ఈ కేంద్రానికి తాళాలు వేసి ఉండటంతో ఓటింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డులోని 8-1 పోలింగ్ బూత్‌లో ఈరోజు రీ-పోలింగ్ జరగాల్సి ఉంది. కేంద్రం తెరుచుకోకపోవడంతో ఓటర్లు అక్కడే వేచి చూస్తున్నారు. పోలింగ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో ఓటర్లు, రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఈ రీ-పోలింగ్ నిర్వహణపై అధికారుల నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది.
రీ-పోలింగ్ జరుగుతున్న ఇతర ప్రాంతాల్లో అనంతపురం 30వ వార్డులోని 30/3 బూత్, చీమకుర్తి 14వ వార్డులోని 14/1 బూత్ ఉన్నాయి. అలాగే మాచర్లలో 23/1, 23/2 బూత్‌లు, కడపలో 15-2 బూత్, జమ్మలమడుగులో 3/2, 17/1, 29/1 బూత్‌లలో ఓటింగ్ జరుగుతోంది.
పులివెందులలోని 1, 3, 7, 8 వార్డుల్లోని 1-1, 3-1, 7-1, 8-1 బూత్‌లలో కూడా రీ-పోలింగ్ నిర్వహించాల్సి ఉంది.








