ఇంజినీరింగ్ సీటు రాలేదని ఆందోళన చెందే విద్యార్థుల కోసం వ్యవసాయ రంగంలో సరికొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా B.Sc Agritech (Hons.) కోర్సును ప్రవేశపెట్టారు. ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండానే విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు.

ప్రస్తుత వ్యవసాయ రంగంలో డ్రోన్లు, AI, రోబోటిక్స్ వంటి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కోర్సులో వ్యవసాయ శాస్త్రంతో పాటు వెబ్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ అప్లికేషన్ల రూపకల్పన, స్మార్ట్ ఫార్మింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి అంశాలను బోధిస్తారు. ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలపై కూడా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

క్యాంపస్‌లోనే DGCA ఆమోదిత డ్రోన్ ట్రైనింగ్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సర్టిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులు వ్యవసాయ సంస్థల్లో నెలకు రూ. 45 వేల వరకు వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారు. వర్మీ కంపోస్టింగ్, ఆధునిక ల్యాబ్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

అగ్రి-టెక్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ అగ్రికల్చర్, అగ్రి స్టార్టప్‌లలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కెరీర్ గైడెన్స్, కోర్సుల ఎంపిక, అడ్మిషన్ ప్రక్రియపై సమాచారం కోసం 92814 16210 నంబర్‌ను సంప్రదించవచ్చని College Mentor నిపుణులు సూచిస్తున్నారు.