కోకా-కోలా డైరీ విభాగంలో భాగస్వామిగా ఉన్న ఫెయిర్‌లైఫ్ సంస్థపై రన్సమ్‌వేర్ దాడి జరిగింది. ఈ సైబర్ దాడి కారణంగా అమెరికాలో కంపెనీకి చెందిన ఉత్పత్తి కేంద్రాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది.

అయితే, కెనడాలో ఉన్న ఫెయిర్‌లైఫ్ ఉత్పత్తి కేంద్రాలపై ఈ దాడి ప్రభావం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ రన్సమ్‌వేర్ దాడిలో సంస్థకు చెందిన సున్నితమైన సమాచారం (సెన్సిటివ్ డేటా) ఏమైనా చోరీకి గురైందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కంపెనీ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి నిర్ధారణ చేయలేదు.

ప్రస్తుతానికి ఉత్పత్తిని ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై కంపెనీ ఎటువంటి తేదీని ప్రకటించలేదు. సిస్టమ్లను పునరుద్ధరించడానికి కంపెనీ కృషి చేస్తోంది.