కోలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఐ యామ్ గేమ్' చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. హాలీవుడ్ స్థాయి ఛేజింగ్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ విజువల్స్‌తో ఈ సినిమా ఒక హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా రూపొందింది. మలయాళ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చూడని యాక్షన్ సన్నివేశాలను ఈ చిత్రంలో చూడవచ్చని మేకర్స్ పేర్కొన్నారు.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ అల్ట్రా-స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటుండగా, ట్రైలర్ చివరలో ఉన్న ట్విస్టులు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 20న ఓణం కానుకగా విడుదల చేయనున్నారు.
'ఆర్‌డీఎక్స్' సినిమాతో విజయం అందుకున్న నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఆంటోని వర్గీస్, మైస్కిన్, కాయదు లోహర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా కోసం జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రఫీని, అన్‌బరివ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. దక్షిణ భారతదేశంలోని 100కుపైగా ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో వేచి చూడాలి.







