నీలాద్రి ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రమేష్ వర్మ దర్శకత్వంలో నటించేందుకు ధృవ్ విక్రమ్ అంగీకరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన కోటి రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినప్పటికీ, షూటింగ్ ప్రారంభానికి ముందు ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్‌తో కొత్త సినిమాను ప్రకటించారు.
రమేష్ వర్మ సినిమా పూర్తి చేసిన తర్వాతే ఇతర ప్రాజెక్టులు చేయాలని నిర్మాతలు కోరుతున్నారు. అయితే, ధృవ్ విక్రమ్ మాత్రం మైత్రీ మూవీస్ సినిమా పూర్తయ్యాక చేస్తానని చెబుతున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. దీనివల్ల వడ్డీల భారం పెరుగుతోందని, తమకు తెలియకుండా మరో నిర్మాతతో సినిమా మొదలుపెట్టడం మోసపూరితమని వారు తమిళ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా మురుగదాస్ మరియు మణిరత్నం దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ సినిమాలు మొదలై ఆగిపోయాయి. వరుస వివాదాలు మరియు కెరీర్ పరమైన అనిశ్చితి నేపథ్యంలో, ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు వెనకాడుతున్నారు. మరోవైపు, ఇటీవల అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం ఈ వివాదంపై తమిళ ఫిలిం ఛాంబర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.








