దక్షిణాసియా ప్రాంతాలతో సాంస్కృతిక సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ దేశాల్లోని చారిత్రక కట్టడాలను కాపాడటం ద్వారా ఆయా ప్రాంతాలతో ఉన్న చారిత్రక బంధాన్ని భారత్ పునరుద్ధరిస్తోంది.
ఇండోనేషియాలోని ప్రాంబనన్ టెంపుల్ కాంప్లెక్స్‌ను సంరక్షించే బాధ్యతను భారత్ చేపట్టింది. అలాగే, లావోస్‌లో ఉన్న వాత్ ఫో టెంపుల్‌ను కూడా భారత్ సంరక్షిస్తోంది.
కేవలం ఆలయాల నిర్మాణాలకే పరిమితం కాకుండా, దక్షిణాసియా ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న రామాయణ గాథలను కూడా భారత్ భద్రపరుస్తోంది. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం ద్వారా ఆయా దేశాలతో సంబంధాలను భారత్ పెంపొందిస్తోంది.








