మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందించారు. మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ కేవలం క్రీడలు మాత్రమే కాదని, ఇవి ఆత్మరక్షణకు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కష్టమైనప్పటికీ, ఇది మానసిక ధైర్యాన్ని పెంచుతుందని మంత్రి తెలిపారు. తక్కువ ఫీజుతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న ఓకినవ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నిర్వాహకుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

జీవితంలో గొప్ప ఛాంపియన్లుగా ఎదగాలంటే కఠిన శ్రమ, క్రమశిక్షణ తప్పనిసరి అని మంత్రి వివేక్ సూచించారు. విజయం సాధించేందుకు వ్యూహం, క్రమబద్ధమైన ప్రాక్టీస్, పట్టుదల ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని, ప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ జీవిత పాఠాల నుంచి స్ఫూర్తి పొందాలని విద్యార్థులకు సూచించారు.

భవిష్యత్తులో విద్యార్థులందరూ అద్భుతమైన ప్రతిభతో ఉన్నత స్థానాల్లో నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.