నర్సాపూర్‌లోని BVRIT కళాశాల ప్రతిష్టాత్మక MathWorks Credentialing Award 2026ను సొంతం చేసుకుంది. ఇంజనీరింగ్ విద్య, పరిశోధనలు మరియు విద్యార్థుల ప్రాజెక్టులలో MatLab, Simulink వంటి సాంకేతికతలను అత్యుత్తమంగా ఉపయోగించినందుకు ఈ అవార్డును ప్రకటించారు.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ రాజగోపాల్ ఈ అవార్డును స్వీకరించారు.

ప్రస్తుతం ఇంజనీరింగ్ రంగంలో Generative AI మరియు Agentic AI (స్వయంగా నిర్ణయాలు తీసుకోగల AI సిస్టమ్) వంటి సాధనాలు ప్రాజెక్టుల రూపురేఖలను మారుస్తున్నాయని MathWorks ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. వివిధ సాంకేతిక విభాగాల్లో MatLab వినియోగం పెరుగుతోందని వారు వెల్లడించారు.