మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మాస్ హిట్ చిత్రంగా నిలిచిన 'ముఠా మేస్త్రి' మళ్లీ వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమాను 4K టెక్నాలజీతో డిజిటల్ వెర్షన్‌గా సిద్ధం చేశారు. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు.
ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన మీనా, రోజా హీరోయిన్లుగా నటించారు. రాజ్-కోటి అందించిన సంగీతం, చిరంజీవి చెప్పిన మాస్ డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మాస్ హంగామాను మరోసారి వెండితెరపై వీక్షించే అవకాశం అభిమానులకు దక్కనుంది.








