ఒకే వ్యక్తిని ప్రేమించడం లేదా ఆ వ్యక్తి విషయంలో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ వివాదం మొదలైంది. పబ్లిక్ స్థలంలో ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, ఆ యువతులు ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగారు.

చుట్టుపక్కల ఉన్నవారు వీరిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, కోపంతో ఉన్న ఆ యువతులు వినకుండా కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సేపటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్లను పొందింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు యువతుల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక అబ్బాయి కోసం బహిరంగంగా ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని, నేటి కాలంలో సహనం తగ్గిపోవడానికి ఇది నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.