క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన ర్యాపిడ్ షోలో రాహుల్ ద్రవిడ్‌కు ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, ఇమ్రాన్ ఖాన్ పేర్లను ఆప్షన్లుగా ఇవ్వగా, ద్రవిడ్ పాకిస్థాన్‌కు ఏకైక వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన ఇమ్రాన్ ఖాన్‌కే ఓటు వేశారు. అయితే, ఓవరాల్‌గా మహేంద్ర సింగ్ ధోనిని ద్రవిడ్ అత్యుత్తమ కెప్టెన్‌గా పేర్కొన్నారు.
భారత జట్టు కెప్టెన్ల ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ధోని 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి భారత్‌కు అత్యధికంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా నిలిచారు. ధోని తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి సారథిగా ఒక్క ట్రోఫీ గెలవకపోయినా, టెస్టుల్లో జట్టును మొదటి ర్యాంకుకు చేర్చారు. అంతేకాదు, మొట్టమొదటి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును నడిపించిన ఘనత కోహ్లిదే.
మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్‌ను గెలవడంతో పాటు, 2025 చాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమిండియాను విజేతగా నిలిపారు.
ఈ ర్యాపిడ్ షోలో భాగంగా ద్రవిడ్ ఇతర కెప్టెన్ల మధ్య జరిగిన పోలికలకు కూడా సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా స్టీవెన్ స్మిత్, రిక్కీ పాంటింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్ల కెప్టెన్సీ సామర్థ్యాలను విశ్లేషిస్తూ, చివరికి స్టీవ్ వాను కూడా ఒక గొప్ప కెప్టెన్‌గా ఆయన గుర్తించారు.







