మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో MMC కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. H-CITI ప్రాజెక్టులో భాగంగా ఆనంద్ నగర్ జంక్షన్ వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్‌తో పాటు, మరో మూడు జంక్షన్ల వద్ద 6 లేన్ల గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి కమిటీ ఆమోదం తెలిపింది.

నగరంలో వ్యర్థాల నిర్వహణపై కూడా కార్పొరేషన్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రోజుకు 500 టన్నుల సామర్థ్యం కలిగిన కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ (C&D) వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్మాణ వ్యర్థాల వల్ల కలిగే సమస్యలను తగ్గించేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడనుంది.

పట్టణంలోని పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2,586.67 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించడం ద్వారా రాబోయే కాలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు కార్పొరేషన్ మార్గం సుగమం చేసింది.