ఆగస్టు 17న సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్‌కు విశాఖపట్నంలో పార్టీ నేతలు స్వాగతం పలుకుతారు. మరుసటి రోజు ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో ఆయన సమావేశమవుతారు.

ఈ పర్యటనలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ, ప్రత్యేక ఎగ్జిబిషన్ సందర్శనతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేసిన తర్వాత, కార్యకర్తలతో కలిసి ఆయన భోజనం చేస్తారు.

ఆగస్టు 18 సాయంత్రం విశాఖ నోవాటెల్ వరుణ్ బీచ్‌లో 200 మందికి పైగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌తో ‘యువ సమ్వాద్’ (యువతతో ముఖాముఖి) కార్యక్రమం ఉంటుంది. ఇందులో వికసిత్ భారత్, ఇన్నోవేషన్, డిజిటల్ లీడర్‌షిప్ అంశాలపై చర్చలు జరగనున్నాయి.

చివరగా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే నితిన్ నబీన్, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై సమీక్షించనున్నారు. ఈ ఐదు రోజుల పర్యటనతో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.