వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్‌‌లో వరుణ యాగం నిర్వహించనుంది. ఇందుకోసం భారీ పందిరి నిర్మించి యజ్ఞవేదికలు, పగోడాలు, ప్రవచనశాలను సిద్ధం చేశారు. ఈ యాగంలో సీఎం రేవంత్‌‌రెడ్డి పాల్గొంటారు.

హాలియా, వెలుగు: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కృష్ణా నది ఒడ్డున వరుణ యాగం నిర్వహించనుంది. ఈ యాగంలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొననున్నారు.

యాగం నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యే యాగం సాయంత్రం 3.20 గంటలకు ముగియనుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు చెందిన అర్చకులు ఈ క్రతువులో పాల్గొననున్నారు.

కృష్ణా నది ఒడ్డున నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయవిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుక ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. భారీ పందిరి నిర్మించి యజ్ఞవేదికలు, పగోడాలు, ప్రవచనశాలను సిద్ధం చేశారు. యాగాన్ని వీక్షించేందుకు గ్యాలరీల్లో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీఎం హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రానున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీసీ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెలిప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హనుమంతరావు, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.