అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ వేధింపుల వల్ల నాగరాజు అనే టీడీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. తనను, తన తండ్రిని కొందరు వ్యక్తులు కొట్టారని పది రోజుల క్రితం నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ కేసులో తనపై, తన పిల్లలపై రివర్స్ కేసు పెడతానని సీఐ శ్రీనివాసరావు బెదిరించాడని నాగరాజు ఆరోపించాడు.

ఈ వేధింపులను తట్టుకోలేక నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైన నాగరాజును ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మరణించాడు.

అచ్చంపేట పోలీసుల పనితీరుపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. లంచాల డబ్బును ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై నాగరాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. సీఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.