శ్రీకాంత్ లాయర్‌గా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్’. ఈ సిరీస్‌కు ‘నోటరీ పరశురాం’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

ఈ సిరీస్‌లో అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. సంతోష్ అయ్యప్పన్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు.

మొత్తం 7 ఎపిసోడ్లతో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. జూలై 31 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.